అక్కినేని జంటను టార్గెట్ చేసిన గీతగోవిందం దర్శకుడు..

తెలుగు ఇండస్ట్రీలో ఓ భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా రెండేళ్ల పాటు ఖాళీగా ఉండటం అంటే చిన్న విషయం కాదు. కానీ అది కేవలం పరశురామ్‌కి మాత్రమే సాధ్యం. ఎందుకంటే గీతగోవిందం సినిమా 50 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. అలాంటి సినిమా తర్వాత ఆయన కోసం హీరోలు, నిర్మాతలు క్యూ కడతారేమో అనుకుంటే ఈయన మాత్రం ఏడాదిన్నరగా ఖాళీగానే ఉన్నాడు. చాలా మంది హీరోలకు కథలు చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మహేష్ బాబు కూడా ఉన్నాడు అందులో. కానీ ఎవరూ ఈయన కథకు ఓకే చెప్పలేదు.
అయితే ఇప్పుడు ఈయన తర్వాత సినిమాకు దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే. నాగచైతన్యతో పరశురామ్ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మించనుంది. అయితే అక్కినేని జంటతోనే తన సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ముందు చైతూతో సినిమా చేసిన తర్వాత ఆ వెంటనే సమంతతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు ఈయన. ఈయన దగ్గర ఉన్న ఓ లేడీ ఓరియెంటెడ్ కథతో సమంతను కూడా లైన్ లో పెడుతున్నాడు. నిజానికి గీత గోవిందం కథని నాగచైతన్య, సమంతతో చేయాలనుకున్నాడు ఈ దర్శకుడు. కానీ అది వాళ్లకు ఎందుకో కిక్ అనిపించలేదు దాంతో విజయ్, రష్మికల చేతిలో పడి బ్లాక్ బస్టర్ అయింది. అందుకే అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు అందుకుంటున్నారు అక్కినేని జంట.