English   

మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో.. పిక్ అదిరిపోయింది కదా.. 

Ram Charan
2019-11-23 13:49:42

ఆహా చూస్తుంటేనే కడుపు నిండిపోయినట్లుంది కదా.. ఇండస్ట్రీలో మెగా హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడుకుంటున్న హీరోలంతా ఒకప్పుడు ఎలా క్యూట్ గా ఉండేవాళ్లో ఈ ఒక్క ఫోటో చెప్పేస్తుంది. ఎప్పుడో దిగిన ఈ ఫోటోను ఇప్పుడు షేర్ చేసాడు వరుణ్ తేజ్. ఇది చూసి మెగా ఫ్యాన్స్ కూడా తెగ ఖుషీ అయిపోతున్నారు. అబ్బా ఏమున్నార్రా మన హీరోలు అంటూ అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోటోలో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, చరణ్, బన్నీ ఉన్నారు. దాంతో పాటే మరో అమ్మాయి కూడా ఉంది. పేరుకు వేర్వేరు పిల్లలే అయినా కూడా అంతా చిరంజీవి ఇంట్లోనే పెరిగారు. అందర్నీ ఒకేలా చూసాడు మెగాస్టార్ కూడా. అందుకే మెగా ఇంటి నుంచి ఏ వారసుడు వచ్చినా కూడా చిరు ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలో ఉన్న హీరోలంతా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 

More Related Stories