English   

పదహారేళ్ళ తర్వాత ఆ డైరెక్టర్ తో గోపీచంద్ 

 Gopichand
2019-11-23 16:04:14

హీరో గోపీచంద్ కెరీర్ కొన్నాళ్ళగా అస్సలు బాలేదు. అప్పుడెప్పుడో లౌక్య సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో ఆ తర్వాత అరడజను సినిమాలు చేసినా అవి వర్జౌట్ కాలేదు. ఈ మధ్యనే ఎన్నో ఆశలతో భారీ బడ్జెట్ పెట్టి చేసిన ‘చాణక్య’ కూడా నిరాశపరచడంతో అయోమయంలో పడిన ఆయన ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన హాకీ కోచ్ గా కనిపించనున్నాడు. ఇక ఆయన తనకి అచ్చొచ్చిన పాత దర్శకుడితో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. 

ఆ దర్శకుడు ఎవరో కాదు తేజ. దర్శకుడు తేజతో గోపీచంద్ అనుబంధం గురించి తెలిసిందే. జయం (2002) సినిమాతో గోపిచంద్ ని నటుడిగా నిలబెట్టిన ఘనత తేజదే. ఆ తర్వాత మళ్లీ 2003లో `నిజం` సినిమాలోనూ గోపికి విలన్ గా అవకాశం ఇచ్చారు తేజ. నితిన్.. మహేష్ సినిమాల్లో విలన్ గా గోపీ నటనకు జనం నీరాజనాలు పలికారు. అయితే ఆ తర్వాత మళ్ళీ తేజ- గోపిచంద్ మరోసారి కలిసి సినిమా చేయలేదు. దీంతో ఈసారి గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా చేస్తారని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.  

More Related Stories