English   

ఆ తమిళ హీరో అంజలిని చెడకొట్టాడు...నిర్మాత షాకింగ్ కామెంట్స్

anjali
2019-11-23 20:23:41

తమిళ హీరో జై నటి అంజలిని చెడగొట్టాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కోలీవుడ్‌కి చెందిన నటుడు, నిర్మాత నందకుమార్. అంజలి, జై ప్రధాన పాత్రలో నటించిన ‘బెలూన్’ సినిమాకు నందకుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సమయంలో అంజలి, జైకి సంబంధించిన అనేక విషయాల మీద నందకుమార్ మీడియా ముఖంగా అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. అంజలి కొంత కాలం పాటు జర్నీ హీరో జైతో ప్రేమాయణం సాగించింది. ఇప్పుడు కాస్త దూరం అయితే అయ్యారు కానీ అప్పట్లో బెలూన్ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం తనకు తీవ్రమైన నష్టాలని మిగిల్చిందని నిర్మాత నందకుమార్ వాపోతున్నాడు. అంజలి చాలా మంది అమ్మాయని, ప్రొఫెషనల్‌ గా కచ్చితంగా ఉండేదని ఎప్పుడైతే జై ఆమె జీవితంలోకి వచ్చాడో అంజలి చెడిపోయిందని ఆయన ఆరోపించారు.

బెలూన్ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్ లో తాను అంజలిని పేరు పెట్టి పిలిచేవాడినని కానీ జై మాత్రం చాలా అతి చేసేవాడని, అంజలి ఏంటి.. మేడం అని పిలవండి.. లేకుంటే షూటింగ్ ఆపేస్తా అని రచ్చ చేసేవాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రోజున అంజలి సెట్‌కి రాకపోవడంతో చాలా సార్లు ఫోన్ చేస్తే ఆమె చాలా సేపటికి ఫోన్ ఎత్తి తనకి కడుపునొప్పి అని చెప్పిందని మేము నిజమే అనుకుని కార్ పమితే అదంతా నాటకం అని తేలిందని చెబుతున్నారు. అదే కారులో వారు ఎయిర్ పోర్ట్ కు వెళ్లి అక్కడి నుంచి చెన్నైకి వెళ్లిపోయారని, దీనితో షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందని తమకు చాలా నష్టం వచ్చిందని నిర్మాత నందకుమార్ చెప్పుకొచ్చారు. మరి ఈ కామెంట్స్ మీద అంజలి, జైలు ఎలా స్పందిస్తారో ?

More Related Stories