English   

తలైవి సినిమా ఫస్ట్‌లుక్‌ కు నెటిజన్ల విమర్శలు

thalivi
2019-11-24 07:19:09

దివంగత సీఎం జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతోన్న తలైవి సినిమా ఫస్ట్‌లుక్‌కు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. దివంగత సీఎం జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా ఫస్ట్‌లుక్‌ విఈరోజు డుదలైంది. అమ్మ లుక్‌లో నటి కంగనా రనౌత్‌ ఏ మాత్రం గుర్తు పట్టలేని రీతిలో కనిపించారు. పచ్చ చీరలో అభివాదం చేస్తున్న బ్యానర్‌ ను ఈ తొలి ప్రచార చిత్రంలో చూపించారు. అయితే పోస్టర్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వచ్చే ఏడాది జూన్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమాలో జయలలితగా కంగన నటిస్తుండగా ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి కనిపించనున్నారు. బ్లేడ్ ర‌న్నర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు. ఏఎల్‌ విజ‌య్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

More Related Stories