మన హీరోయిన్లకు వ్యాధులు.. షాక్ అవుతున్న అభిమానులు..

తెలుగు హీరోయిన్లలో కొందరు వ్యాధులతో బాధ పడుతున్నారనే చేదు నిజం ఇప్పుడు అభిమానులను కలవరపెడుతుంది. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన జబ్బులు వున్నాయి. ఆ మధ్య సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే చాలా రోజుల పాటు కాన్సర్ తో బాధ పడింది. లండన్ వెళ్లి చికిత్స తీసుకుని ఇప్పుడు మళ్లీ మామూలు మనిషి అయింది. ప్రస్తుతం సినిమాలు కూడా చేయడానికి సిద్ధమవుతుంది సోనాలి. ఆ తర్వాత సమంత కూడా ఒకప్పుడు ఛర్మ సంబంధిత వ్యాధితో బాధ పడింది. అందుకే అప్పట్లో ఎవడు లాంటి సినిమా నుంచి కొంతభాగం షూట్ చేసిన తర్వాత తప్పుకుంది. నయనతార కూడా ఏదో చర్మ సంబంధిత వ్యాధితో ఇప్పటికీ బాధ పడుతూనే ఉంది. ఇక సింహా సినిమాలో బాలయ్యతో జోడీ కట్టిన స్నేహా ఉల్లాల్ కు రక్తహీనత వ్యాధి ఉంది. దానివల్ల అరగంట కూడా సరిగ్గా నిలబడలేని పరిస్థితుల్లో పడిపోయింది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. చాలా మంది హీరోయిన్లకు అనుకోని అనారోగ్య సమస్యలున్నాయి. వాటి నుంచి త్వరగా బయటపడాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.