English   

జీవితమే ఒక ఆట అంటున్న పూజా హెగ్డే..

pooja
2019-11-24 11:48:22

జీవితం అంటేనే ఆట.. ఇక్కడ అనుకున్నది అనుకున్నట్లుగా ఎప్పుడూ జరగదు. ఇంత ఫిలాసఫీ ఎవరు చెప్తున్నారిప్పుడు అనుకుంటున్నారా..? ఇంకెవరు పూజా హెగ్డేనే చెబుతుంది. ఈమె ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి హీరోలతో జోడీ కట్టిన ఈమె.. ఇప్పుడు ప్రభాస్ తో రొమాన్స్ చేస్తుంది. అంతేకాదు.. బన్నీతో రెండోసారి అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తుంది. ఈ ఏడాది నటించిన వాల్మీకితో పాటు మహర్షి కూడా మంచి విజయాలనే అందుకున్నాయి.

ఇప్పుడు మరో మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. తనిలా నటి అవుతానని ఎప్పుడూ ఊహించలేదని చెబుతుంది. అసలు యాక్టింగ్ వైపు రావాలనే ఐడియా కూడా తనకు లేదని.. చిన్నపుడు తనను అంతా పెద్దయ్యాక ఏమవుతావంటే ఏమో అనుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. నటి కావాలన్న ఆలోచన కూడా తనకు లేదని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. కానీ తన స్నేహతులు, అన్నయ్య మాత్రం మేం ఇది అవుతాం.. పెద్దైన తర్వాత అలా చేస్తామని చెప్పేవాళ్లు.. తనకు మాత్రం ఆ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉండేదని చెప్పింది పూజా. అలాంటి సమయంలో అనుకోకుండా తాను మోడలింగ్‌లోకి వచ్చానని.. అక్కడ్నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇదిగో ఇలా ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నానని చెబుతుంది ఈ బ్యూటీ.

More Related Stories