English   

బన్నీ - కాజల్ ఒక స్పెషల్ సాంగ్

allu
2019-11-24 15:36:22

కాజ‌ల్ అగ‌ర్వాల్ జ‌నతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్‌తో క‌లిసి చేసిన స్పెషల్ సాంగ్ ఆల్ టైం ఫేవరేట్ గా నిలిచింది. ఈ అమ్మడు నాలుగేళ్ల క్రితమే ఈ సాంగ్ కోసం కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ కూడా అందుకుంది. అయితే ఈ అమ్మడి చేత మళ్ళీ ఒక స్పెషల్ సాంగ్ చేయించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ న‌టిస్తున్న అల వైకుంఠ‌పురములో సినిమా మీద రోజు రోజుకి అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబందించి విడుద‌లైన అన్ని లిరికల్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఆయా సాంగ్స్ కొరియోగ్రఫీలను కూడా జాగ్రత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు స్వతహాగా డ్యాన్సర్ అయిన బన్నీ. ఈ సినిమా కోసం ఫారెన్ డ్యాన్సర్స్, ముంబై మోడ‌ల్స్‌ అంటూ లేకుండా అందరినీ వాడేస్తున్న బన్నీ ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌ లో మాత్రం కాజూని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. నిజానికి ఈ విషయంలో ముందు బుల్లితెర బ్యూటీ అన‌సూయ పేరు లైన్ లోకి వ‌చ్చినా బ‌న్నీ కాజ‌ల్ కోసం పట్టు పడుతున్నట్టు సమాచారం. కాజ‌ల్ ప్రస్తుతం జాన్ అబ్రహం ముఖ్య పాత్ర పోషిస్తున్న ముంబై స‌గా అనే హిందీ సినిమా, మ‌రోవైపు కమల్-శంకర్ ల ఇండియ‌న్ 2 సినిమాలు చేస్తోంది. మరి ఆమె ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. 

More Related Stories