English   

ఒక హీరో పది మంది హీరోయిన్స్ !

director
2019-11-24 16:00:30

ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి సినీరంగ ప్రవేశం చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ధమరుఖం ఫేం దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెరకెక్కించిన ‘రాగల 24 గంటల్లో’ అనే సినిమా తాజాగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన ముస్కాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు లక్ష్మీ పార్వతి సినీ ఎంట్రీ గురించి చర్చకు తావిచ్చాయి. ఆమె మాటల ప్రకారం రాధాకృష్ణ అనే పేరుతో శ్రీనివాసరెడ్డి లేడీ ఓరియెంటెడ్‌ సినిమా ఒకటి చేస్తున్నారని అందులో లక్ష్మీపార్వతి కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. లక్ష్మీపార్వతితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉన్నదని ముస్కాన్‌ చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాటలు కన్విన్సింగ్ గానే ఉన్నాయి. ఎందుకంటే దర్శకుడు, లక్ష్మీ పార్వతి ఇద్దరూ వైసీపీ వారే కావడం, ఇద్దరికీ జగన్ కీలక పదవులు కట్టబెట్టడం ఈ వాదనకు ఊతం ఇస్తోంది. అయితే ఆ సంగతి పక్కన పెడితే ఈ దర్శకుడు రాగల 24 గంటల్లో నిర్మించిన నిర్మాత కలిసి భార్యదేవోభవ అనే సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో ఒక స్టార్ హీరో అలాగే పదిమంది హీరోయిన్స్ నటించనున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల మీద ఆయనే క్లారిటీ ఇస్తే కానీ ఏమీ తేలదు..

More Related Stories