English   

సల్మాన్ ఖాన్ నా దేవుడు అంటున్న బాలీవుడ్ హీరోయిన్..

salman
2019-11-24 16:29:37

హీరోలు నిజంగానే సినిమాల్లో ఉంటారు కానీ బయట ఉండరు అంటారు. కానీ బాలీవుడ్ లో కొందరు హీరోలను చూస్తే మాత్రం అలా అనిపించదు. వాళ్లు సినిమాల్లోనే కాదు.. బయట కూడా హీరోలే. అలాంటి పనులు చేస్తుంటారు కూడా. ఇప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ కూడా ఇదే చేసాడు. తనతో పాటు వీర్‌గతి సినిమాలో నటించిన చుంకీ పూజా డడ్వాల్ అనే నటి మృత్యువు అంచుల వరకూ వెళ్లింది. డబ్బులు లేక కనీస వైద్య సదుపాయాలు కూడా లేక నానా యాతన పడింది ఈ ముద్దుగుమ్మ. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నటించాలనుకుంది.. కానీ పరిస్థితి చూస్తుంటే చేదాటిపోయేలా కనిపించింది. అలాంటి సమయంలో కనీసం ఎవరూ ముందుకు కూడా రాలేదు. మరోవైపు టీబీ వ్యాధి బారిన కూడా పడింది పూజా. ఆ సమయంలో చికిత్సకు కూడా డబ్బులు లేకపోవడంతో ఎలాగైనా సినిమా వాళ్లనే అడగాలని నిశ్చయించుకుని.. ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన వ్యక్తిగత వివరాలను కూడా మీడియాతో పంచుకుంది. తనకు మొదట్లో టీబీ సోకిందని.. ఆ విషయం చాలా రోజుల వరకు కూడా తనకు తెలియలేదని చెప్పింది పూజా. అనారోగ్యం కారణంగా పూర్తిగా బలహీనపడిపోయానని.. ఇక సినిమాలు కూడా చేయలేనేమో.. కనీసం బతుకుతానా లేదా అనే అనుమానాలు కూడా తనలో ఉండేవని చెప్పుకొచ్చింది ఈమె.

సరిగ్గా ఆ సమయంలో రాజేంద్ర సింగ్ అనే దర్శకుడి సాయంతో ముంబై వెళ్లి అక్కడి ఆసుపత్రిలో చేరానని తెలిపింది పూజా. తన విషయం మీడియా నుంచి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ తనకు మెరుగైన వైద్యం అందేందుకు ఆర్థిక సహాయం చేశారని గుర్తు చేసుకుంది. సల్మాన్ టీమ్ తనతో పాటు 24 గంటలూ ఉండి సంరక్షించారని తెలిపింది. ఇప్పుడు ఆరోగ్యం సంపూర్ణంగా కుదుటపడటంతో తిరిగి నటన ప్రారంభిస్తానని చెబుతుంది పూజా. భవిష్యత్‌లో కష్టార్జితంతో ఇల్లు కట్టుకుంటానని.. అప్పుడు ఆ ఇంటిలో భగవంతుని ఫొటో బదులు సల్మాన్ ఫొటో పెట్టుకుని పూజిస్తానని పేర్కొంది. మొత్తానికి ఓ నటికి సల్మాన్ చేసిన సాయం ఆమె ప్రాణం అన్నమాట.

 

More Related Stories