బన్నీ సాంగ్ మీద.... పాక్ లో చర్చ

అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అల.. వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశాడు. తొలి సాంగ్గా సామజవరగమనా అనే సాంగ్ విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట మ్యూజిక్ ప్రియులని ఎంతగానో అలరించడమే కాక ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.
అయితే ఇప్పుడు ఈ పాత మళ్ళీ ఎందుకు గుర్తొచ్చింది అంటే ఈ సినిమాలోని పాట మీద ఇప్పుడు మన దాయాది దేశం మనమంటేనే పడి ఏడిచే పాకిస్తాన్ లో ఈ సాంగ్ మీద చర్చ జరుగుతోంది. పాకిస్తాన్కి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ సాంగ్ మీద ఆన్ లైన్ డిబెట్ నిర్వహించారు. భాష అర్ధం కాకపోయిన మ్యూజిక్ మాత్రం వినసొంపుగా ఉందంటూ వారు ప్రశంసలు కురిపించారు.
అల్లు అర్జున్, పూజా హెగ్డేల గురించి కొంత సేపు చర్చించి ఆ తర్వాత బన్నీ నటించిన ‘సరైనోడు’ సినిమా గురించి వారు ఈ వీడియోలో మాట్లాడారు. అక్కడితో ఆగక ఈ వీడియోని పాకిస్థానీయులు తప్పక చూడమని చెప్పడం హైలైట్.