తమన్ కి గిఫ్ట్ ఇచ్చిన ధరమ్ తేజ్...ప్రతి రోజూ పండగేనట

ట్యూన్ ఎంత వినూత్నంగా ట్రై చేస్తున్నా తన మీద ఉన్న కాపీ క్యాట్ అనే ముద్ర నుంచి బైటకపడలేకపోతున్నాడు తమన్. అరవింద సమేత వీర రాఘవతో తమన్ మారిపోయాడు ఆనాటి నుండి అన్నీ కొత్త ట్యూన్స్ క్రియేట్ చేస్తున్నాడనుకుంటే అల వైకుంఠపురములో సినిమాకి చేసిన అన్ని సాంగ్స్ కాపీ ట్యూన్స్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఆ సంగతి ఎలా ఉన్నా మనోడికి వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఏమాటకి ఆ మాటే కొన్ని కొన్ని ట్యూన్స్ బలే కట్టేస్తాడు ఈ సంగీత దర్శకుడు. తాజాగా ఒక విచిత్రమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ను తమన్ కు సాయి ధరమ్ తేజ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నా ప్రియమైన స్నేహితుడు సాయి ధరమ్ తేజ్ ఈ లవ్లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకో బిగ్ సర్ప్రైజ్.
ఈయన నిజంగానే ప్రతిరోజూ పండగే అన్నట్టు చేశారు. హృదయాన్ని హత్తుకునే చాలా గొప్ప వ్యక్తి. మేం విజయం సాధించాలని చాలా గట్టిగా ప్రార్థిస్తా’’ అంటూ తమన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ బాగా పాపులర్ అయింది. దీని పెర్ల్ మాలెట్‌స్టేషన్. దీనిపై ఎలాంటి సౌండ్ అయినా వచ్చేస్తుంది. కీబోర్డ్, డ్రమ్స్ ఇలా రకరకాల సౌండ్స్ దీనిపై వాయించొచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్ కి ఇప్పుడుప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఇటీవల ఎ.ఆర్.రెహమాన్ తన కుమారుడు ఎ.ఆర్.అమీన్‌తో ఈ ఇన్స్ట్రుమెంట్ను ప్లే చేయించారు. ఇద్దరూ కలిసి మ్యూజిక్‌ను కంపోజ్ చేసిన వీడియో ఒకటి ఆయన యూట్యూబ్‌లో పెట్టారు. ఈ పరికరం విలువ దాదాపుగా 82 వేలని అంటున్నారు.