English   

ప్రభాస్ ఫ్యాన్స్ కి అప్డేట్ కావాలట 

 Prabhas
2019-11-25 10:34:20

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో ప్రేక్షకుల ముందుకు అనుకున్న మేర ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇది ప్రభాస్ కి 20 వ సినిమా కాగా ఈ సినిమా అసలు మొదలయిందో లేదో ? మొదలయితే షూట్ ఎంతదాకా వచ్చిందో కూడా తెలీని పరిస్థితి. సాహో చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్స్ కృష్ణం రాజుకు చెందిన గోపీ కృష్ణా మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమాలోని ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రకరించేందుకు అనుకున్న టైం ప్రకారం సెట్ రెడీ కాకపోవడంతో షూటింగ్ వాయుదా పడినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ దీనిపైన చిత్ర యూనిట్ ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఏమైనా చెప్తారేమో అని ఎదురు చూసీ చూసీ ఇక లాభం లేదనుకున్నారో ఏమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మా అభిమాన హీరో సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. we want prabhas 20 update అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ యువీ క్రియేషన్స్ కి ట్యాగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ గా కూడా మారింది. ఈ హాష్ ట్యాగ్ తో ఏకబిగిన రెండు లక్షల మంది ట్వీట్ చేయడంతో అది ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఇప్పటికయినా అభిమానుల కోరిక మేరకు సినిమా యూనిట్ ఏమైనా స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి.

More Related Stories