English   

లవర్స్ డే రోజున వరల్డ్ ఫేమస్ లవర్

World Famous Lover
2019-11-25 10:46:42

ప్రస్తుతం యూత్‌లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో ఎవరయ్యా అంటే తడుముకోకుండా చెప్పే పేరు విజయ్ దేవరకొండ.ఆయన హీరోగా లేటెస్ట్‌గా వచ్చిన 'డియర్ కామ్రేడ్' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం, కొత్త డైరెక్టర్‌తో మొదలుపెట్టిన 'హీరో' సినిమా ఏమయ్యిందో అప్డేట్ లేకపోవడంతో విజయ్ పనైపోయింది అని కూడా వార్తలు వచ్చాయి. అయితే పూరి జగన్నాథ్‌తో 'ఫైటర్' అనే సినిమా మొదలుపెట్టాడు. ఇక విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్‌తో ఒక సినిమా ఓకే చేసాడు. అదే 'వరల్డ్ ఫేమస్ లవర్'. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని కేయస్‌ రామారావు సమర్పణలో వల్లభ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఒక్క షెడ్యూల్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా లైనప్ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆ మధ్య ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా వచ్చింది. ముఖం మీద గాయాలు, రక్తం...నోట్లో సిగరెట్ పొగ, చేతిలో వెలుగుతున్న సిగరెట్ తో రచ్చ రేపాడు విజయ్.  

More Related Stories