English   

మెగాస్టార్ ఇంట పార్టీ...డుమ్మా కొట్టిన బాలయ్య 

Balakrishna
2019-11-25 11:05:47

80ల్లో ఉన్న స్టార్స్ అంతా కలిసి క్లాస్ ఆఫ్ ఎయిటీస్ అంటూ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని వారందరూ ఏటేటా కలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ఇలాంటి పార్టీ నిన్న రాత్రి జరిగింది. అయితే ఈ సారి మన మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ పార్టీ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే కొత్త ఇంట్లోకి వెళ్లాడు. అక్కడే ఈ పార్టీ జరిగింది.ఈ సారి ప‌దో వార్షికోత్స‌వం కావడంతో పార్టీ గ్రాండ్ గా ప్లాన్ చేసి మెగాస్టార్ గట్టిగా చేశాడు. ఈ రీయూనియ‌న్ లో ఈసారి 1980-1990లో అగ్ర తార‌లు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. 

తెలుగు ఇండస్ట్రీ నుంచి నాగార్జున, వెంకటేష్, సుమన్, భానుచందర్ లాంటి వాళ్లు ఈ మీట్ కి హాజరయ్యారు. తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా శరత్ కుమార్, ప్రభు లాంటి వాళ్లు వచ్చారు. మళయాళం నుంచి మోహన్ లాల్ వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా టాలీవుడ్ నుంచి బాలయ్య బాబు రాలేదు. ఆయన ఎందుకు రాలేదా అని అని ఆరా తీస్తే ఆయన ప్రస్తుతం రూలర్ సినిమాతో బిజీగా ఉన్నాడని అంటున్నారు. డిసెంబర్ 20న విడుదల కానుండటంతో ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అందుకే రీ యూనియన్ పార్టీ మిస్ అయ్యాడని అంటున్నారు. బాలయ్య నిర్మాతల హీరో అనే సంగతి తెలిసిందే. అందుకే షూట్ క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక బాలయ్య షూట్ కి వెళ్ళాడని సమాచారం.

More Related Stories