English   

రీ యూనియన్ పార్టీలో చిరంజీవి రచ్చ.. మాజీ హీరోయిన్లతో రొమాన్స్..

Chiranjeevi
2019-11-25 12:23:04

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా రియూనియన్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎనభైల్లో ఉన్న తారలంతా ఒక్కచోట కలిసి అదిరిపోయే పార్టీ చేసుకున్నారు. అందులో సూపర్ స్టార్లు కూడా ఉన్నారు. చిరంజీవి కొత్త ఇంట్లో జరిగిన ఈ వేడుకకు మాజీ హీరోయిన్లు చాలా మంది వచ్చారు. అందులో చిరంజీవికి అత్యంత ఆప్తులైన రాధిక సుహాసిని లిజి ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దగా ఉంది. ఈ వేడుకలో అందరూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్ పెట్టుకొని ఫుల్లుగా డాన్సులు చేసి దుమ్ము దులిపేశారు. ఇక చిరంజీవి కూడా తనతో నటించిన 80ల ముద్దుగుమ్మలతో ఓ రేంజ్ లో ఆడి పాడి ఎంజాయ్ చేశాడని తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్స్ కుష్బూ, సుహాసిని, లిజి లాంటి వాళ్ళతో చిరంజీవి డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. అది చూసి మెగా ఫ్యాన్స్ సైరా మెగాస్టార్ అనుకుంటున్నారు. ఇలాంటి ఫోటోలు ఇంకా చాలానే ఉన్నాయి. అయితే ఒక్కొక్కటిగా బయటికి వస్తుండటంతో ఫాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

More Related Stories