English   

సరిలేరు నీకెవ్వరులో అదే హైలెట్.. సీక్రెట్ బయటపెట్టిన అనిల్ రావిపూడి..

 Anil Ravipudi
2019-11-25 12:49:40

మొన్నటివరకు ప్రమోషన్స్ లో చాలా వెనుకబడి పోయాడు మహేష్ బాబు. ఒకవైపు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ప్రమోషన్స్ దూసుకుపోతుంటే మహేష్ బాబు మాత్రం కనీసం ఒక్క టీజర్ కూడా విడుదల చేయలేక చాలా వెనుకబడి పోయాడు. ఈ విషయంలో అభిమానులు కూడా ఎంతో ఫీలయ్యారు. ఇవన్నీ చూసిన దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదల చేసాడు. 

ఇక అది వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో సృష్టించిన రికార్డులు మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. మరోసారి ఇండస్ట్రీ రికార్డులను తన పేరుమీద రాసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమాలో అజయ్ పాత్ర మహేష్ పాత్రకు ట్విస్ట్ ఇవ్వడమే కాకుండా మహేష్ పాత్రను ఎలివేట్ చేసే విధంగా ఉంటుందనీ.. ఎవరు ఊహించని విధంగా ఉండటంతో ధియేటర్ లో ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం అని అంటున్నారు.

అంతేకాదు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక విజయశాంతి మినహా మిగిలిన పాత్రలన్నీ అనిల్ రావిపూడి తనదైన శైలిలో కామెడీ చేయించాడని తెలుస్తోంది. ఆ కామెడీకి ప్రేక్షకులు విపరీతంగా నవ్వుకోవడం ఖాయం అని అంటున్నారు. ముఖ్యంగా సీరియస్ గా నటిస్తూ ఆ నటనలోనే కామెడీని పలికించే ప్రకాష్ రాజ్.. నట విశ్వరూపం ఈ సినిమాలో మరోసారి ప్రేక్షకులకు కనిపిస్తుందనీ హామీ ఇస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మొన్న టీజర్ లో కూడా ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగు ఓ రేంజ్ లో హైలైట్ అయింది. ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడు వస్తున్నాడు అంటూ ఈయన చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. 

మొన్న విడుదలైన టీజర్ లో హీరోయిన్ రష్మిక మందన లేకపోవడంతో ఆమె అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. దాంతో మహేష్ బాబు రష్మిక స్పెషల్ టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక టీచర్ కానీ మేకింగ్ వీడియో గాని విడుదల చేస్తూనే ఉంటాము అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అలా చేయడం వల్ల సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని ఆయన భావిస్తున్నాడు. ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఒక ఓపెనింగ్ గ్రౌండ్లో ప్రేక్షకుల మధ్యలో చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది సరిలేరు నీకెవ్వరు సినిమా.

More Related Stories