English   

పుట్టపర్తి సత్యసాయి మందిరం దర్శించుకున్న సాయి పల్లవి..

Sai Pallavi
2019-11-25 13:04:57

సాయి పల్లవి సినిమాలతో పాటు ఆధ్యాత్మిక విషయాలపై కూడా మంచి పట్టు ఉంది. ఆమె స్వతహాగా సాయి భక్తురాలు.. అందుకే ఎప్పుడు సాయి చింతనలోనే ఉంటుంది. ఆమె పేరు కూడా పల్లవి అయితే ముందు సాయి అని జోడించుకుంది సాయిపల్లవి. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పుట్టపర్తి సత్యసాయి మందిరానికి వచ్చింది. 

ప్రస్తుతం నటిస్తున్న శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్ అక్కడే జరుగుతుండటంతో ఒకసారి వచ్చి సత్యసాయి మందిరాన్ని దర్శించుకుంది సాయిపల్లవి. ఈ సినిమాతో పాటు విరాటపర్వంతో కూడా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం షూటింగ్ కూడా అక్కడి పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఇందులో నక్సలైట్ పాత్రలో నటిస్తోంది సాయి పల్లవి. నీది నాది ఒకే కథ సినిమా తెరకెక్కించిన వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. తన సినిమాల షూటింగ్స్ అక్కడే జరుగుతుండటంతో కాస్త సమయం చూసుకొని సత్య సాయి మందిరానికి వచ్చింది సాయి పల్లవి.

 ఆమె రాక గురించి తెలుసుకున్న అక్కడి ఆలయ పెద్దలు స్వయంగా వెళ్లి సాయి పల్లవికి ఘనస్వాగతం పలికారు. పుట్టపర్తి సాయిబాబా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన జయంతి సందర్భంగా ప్రస్తుతం ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటికి హాజరై మందిరంలోని చాలా సేపు గడిపింది సాయి పల్లవి. అక్కడి అధికారులతో పాటు భక్తులను కూడా కలిసి అందరితో సరదాగా సెల్ఫీలు దిగింది. కొన్ని గంటలపాటు ఆలయంలోనే ఉన్న సాయి పల్లవి తర్వాత అక్కడి నుంచి నేరుగా షూటింగ్ కు వెళ్లిపోయింది. తన తల్లి, చెల్లలుతో పాటు పుట్టపర్తి ఆలయానికి వచ్చింది సాయి పల్లవి. ఆమె రాకతో అక్కడ సందడిి వాతావరణం ఏర్పడింది.

More Related Stories