English   

సినిమాల్లోకి రాక ముందు యాంకర్ గా నయన్...వీడియో వైరల్ !

nayan
2019-11-25 20:31:33

హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ కెరీర్‌ చాలా చిన్నది. వయసు, అందం వీటికి తోడు హిట్స్ ఆధారంగానే వాళ్ళ కెరీర్ నడుస్తుంటుంది. కానీ, కొద్దిమంది ముద్దుగుమ్మల కెరీర్‌ మాత్రం ఈ మూడు సూత్రాలకు అతీతంగా పరుగులు పెడుతుంటుంది. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది నయనతార.
చంద్రముఖి సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పై మెరిసిన డయానా కురియం తొలి సినిమాతోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించే అరుదైన అవకాశం కొట్టేసి ఎంతోమంది అభిమానులను సంపాదించింది. తెలుగు, తమిళంలో దాదాపు అగ్రహీరోలందరితో నటించి టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. తర్వాత తర్వాత లేడీ సూపర్‌స్టార్‌గా పేరు కూడా తెచ్చుకుంది ఈ భామ. నయనతార నటిగా కెరీర్ ప్రారంభించడానికి ముందు మలయాళం టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేసిందట. దీనికి సంబంధించిన 17 సెకండ్ల పాత వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. యాంకర్‌గా తన పేరు డయానా అని వీడియోలో చెప్పారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు, అభిమానులు అసలు మనం చూస్తున్నది నయనతారేనా అని సంబ్రమాస్చార్యాలకు గురవుతున్నారు.

More Related Stories