English   

అయోధ్య మీద సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన వివాదాస్పద నటి

kangana
2019-11-26 05:09:38

మనకి ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఎలాగో బాలీవుడ్ లో కంగనా అలా అన్న మాట. కంగనా రనౌత్ అంటేనే కాంట్రవర్శీ అన్నంతగా వివాదాలకు కేరాఫ్ అయిపోయిందండీ ఈ నటి. తనకి నచ్చని వాళ్లున్నా, తను నచ్చని వాళ్లున్నా తాను ఏకి పడేయడమే కాక తన అక్కను ఎగదోసి మరీ తిట్టించే ఈమెకి మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. దీంతో ఆమె ఎక్కడా తగ్గదు. ఒకసారి అలానే ఏకంగా మీడియాతో కొర్రీ పెట్టుకుని మరీ రచ్చ చేసింది ఈ భామ. అయితే మన వర్మ ఎప్పుడూ ట్రేండింగ్ లో ఉన్న విషయాల మీద కాన్సంట్రేట్ చేసి ఎలా సినిమాలు ప్రకటిస్తాడో ఈమె కూడా అలానే ఒక సినిమా ప్రకటించింది.

ఈ మధ్యనే రాణీ ఆఫ్ ఝూన్సీ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన కంగనా తన నిర్మాణ సంస్థ నుంచి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సిద్దమైంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో తుది తీర్పు వెలువడ్డ సంగతి తెలిసిందే కదా. ఇదే కథాంశంతో అపరాజిత అయోధ్య అనే సినిమాని తెరకెక్కించనున్నట్లు కంగనా ప్రకటించింది. ఓ నాస్తికుడు భక్తుడిగా ఎలా మారాడనే కథాంశంతో అపరాజిత అయోధ్యను తెరకెక్కించనున్నట్లు ఆమె పేర్కొంది. ఈ చిత్రం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తుందని..తాను నిర్మాతగా తెరకెక్కించబోయే తొలి సినిమాకు ఈ కథ అయితే బాగుంటుందని కంగనా ప్రకటించింది.ఆమె ప్రస్తుతం జయలలిత బయోపిక్ తలైవిలో నటిస్తోంది.

 

More Related Stories