English   

ఢీ రాజుతో హీరోయిన్ పూర్ణ ఎంగేజ్‌మెంట్ !

dhee
2019-11-26 05:22:26

బుల్లితెర చరిత్రలో అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది 'ఢీ' ప్రోగ్రాం. ఇప్పటికి పదకొండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పన్నెండో సీజన్ నడుస్తోంది. అయితే తాజాగా ఈ షోలో ఓ ఊహించని పరిణామం జరగడం సంచలనంగా మారింది 'ఢీ చాంపియన్స్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో గతంలో ఈ షో ద్వారా పాపులర్ అయిన డ్యాన్సర్స్ కాంటెస్ట్ చేస్తున్నారు. ఈ షో కేవలం డ్యాన్స్ వరకే పరిమితం కాక యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, రష్మీ సహా జడ్జులు అందరూ కలిసి స్టేజ్‌ పై నవ్వులు పూయిస్తుంటారు.

అందునా యాంకర్ ప్రదీప్ కామెడీ టైమింగ్ అయితే ఇంకా ప్లస్ అయితే ఈ మధ్య అతడు ఈ షోకు దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో మరో యాంకర్ రవి, వర్షిణి షోలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. యాంకర్ ప్రదీప్ గైర్హాజరు అవడం ఈ షోకి దెబ్బ పడింది. దీంతో షోకి మసాలా యాడ్ చేయడానికి టీం సిద్దమయ్యింది. ఢీ షో వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోను సదరు చానెల్‌ విడుదల చేసింది. ఇందులో జడ్జ్‌ ల్లో ఒకరైన హీరోయిన్ పూర్ణకు ఢీ కంటెస్టెంట్ రాజుతో ఎంగేజ్మెంట్ అయినట్లు చూపించారు. ఇందులో రాజు మోకాళ్లపై కూర్చుని పూర్ణ వేలికి ఉంగరం తొడిగేసాడు. షో టెలీకాస్ట్ అయితే కానీ చెప్పలేము అసలు సంగతి ఏంటో ?

More Related Stories