English   

అల్లు అర్జున్ కొత్త ఆఫీస్ ఎలా ఉండబోతుందో తెలుసా..

aa
2019-11-26 05:29:47

తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ సపరేట్. ఆయన ఆలోచనా విధానం కూడా విచిత్రంగా ఉంటుంది. మిగిలిన హీరోలతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఆలోచిస్తాడు అల్లు వారబ్బాయి. ఆమధ్య 6 కోట్లు ఖర్చుపెట్టి కార్వాన్ తెచ్చుకున్నప్పుడే బన్నీ రేంజ్ ఏమిటనేది అర్థమైపోయింది. ఇక ఈ మధ్య కొత్త ఇంటికి ముహూర్తం కూడా పెట్టాడు అల్లు అర్జున్. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా జూబ్లీహిల్స్ లో కార్పొరేట్ కంపెనీ అనిపించేలా ఒక భారీ ఆఫీస్ నిర్మించబోతున్నాడు అల్లు అర్జున్. ఇందులో సకల సౌకర్యాలు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా అభిమానులు, విజిటర్స్ ని కలవడానికి ఓపెన్ ఏరియా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు ఈ ఆఫీసులో అత్యంత ఖరీదైన ఇంటీరియర్స్ ప్రత్యేకంగా దిగుమతి చేసుకుంటున్నారు అల్లు అర్జున్. ఇందులోనే ఒక హాలు ఉంటుందని.. ఇక్కడే అల్లు అర్జున్ తన మీటింగ్స్ జరుపుతారని తెలుస్తోంది.

ఫర్నిచర్ కూడా ఇంపోర్టెడ్ ఉండబోతుంది. దానికితోడు యాడ్ ఫిలిమ్స్ షూటింగ్ కోసం ఒక చిన్న స్టూడియో కూడా ఉండబోతుంది. ఇక ఆఫీస్ నిండా గీతాఆర్ట్స్ తో పాటు అల్లు అర్జున్ సినిమా పోస్టర్ లతో నింపేయనున్నారు. కార్పొరేట్ కంపెనీలు వస్తే మాట్లాడటానికి అక్కడే ఒక గదిని కూడా ఏర్పాటు చేస్తున్నారు.. దాంతోపాటే మీడియా కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సపరేట్ గా ఒక మీడియా రూమ్ సిద్ధం చేస్తున్నాడు. పార్కింగ్ కూడా చాలా భారీగా ఉంటుందని తెలుస్తోంది. భారీ ఎత్తున కార్లు బైకులు ఆగడానికి ఖాళీ స్థలం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా ఒకటేమిటి ఒక కార్పొరేట్ ఆఫీస్ ను తలదన్నే రేంజిలో కోట్లు ఖర్చు పెట్టి తన కొత్త ఆఫీస్ నిర్మించుకున్నాడు బన్నీ. ఒక్కసారి ఇది పూర్తయిన తర్వాత టాలీవుడ్ లో అల్లు అర్జున్ హాట్ టాపిక్ కావడం ఖాయం.. త్వరలోనే మొదలు కానుంది.

More Related Stories