వరుస ఛాన్స్ లు కొడుతున్న వరుణ్ తేజ్

బిగ్‌బాస్ పాపులారిటీ ఆయా కంటెస్టెంట్లకు ఉపయోగపడుతుందా ? అంటే పెద్దగా ఉపయోగపడేది ఏమీ ఉండదు. శివబాలాజీ, ఒక కౌశల్ ఏమయ్యారు..? తనీష్, సామ్రాట్ వంటి నటులకు ఏం ఒరిగింది..? తాత్కాలికంగా బిగ్‌బాస్ నుంచి వచ్చిన రెమ్యునరేషన్ తప్ప అంతిమంగా వాళ్ల కెరీర్లకు నో యూజ్ అనేది తాజాగా ఒక విశ్లేషకుడు బిగ్ బాస్ మీద చేసిన కామెంట్. కానీ వరుణ్ కి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయట. నిజానికి హ్యాపీడేస్ సినిమా తర్వాత వరుణ్ సందేశ్‌కు 'కొత్త బంగారం లోకం' కూడా మంచి బూస్టప్ ఇచ్చింది. ఆ రెండు సినిమాలు చూసి ఆయనకు వరుస ఆఫర్లు వరించాయి. కానీ అవేవీ ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఆయన కెరీర్ కొంచెం ట్రబుల్లో పడింది. దాదాపు 5 ఏళ్లు పాటు సినిమా అవకాశాల్లేకపోయినా ఇప్పుడు బిగ్ బాస్ 3 మళ్లీ బూస్ట్ ఇచ్చింది. బాగ్ బాస్-3లో నాలుగు స్థానంలో కొనసాగిన ఆయన విన్నర్ కాలేకపోయినా అవకాశాలు మాత్రం దండిగా వస్తున్నాయట. ఆయన ఇప్పటివరకూ 10 సినిమాలకు కథలు విని అందులో ఒక మల్టీస్టారర్‌కు ఒకే చెప్పారట. ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకురానున్నారనేది సమాచారం. ఈ సినిమా తర్వాత మరో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టనున్నారట. వరంగల్ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి ఇందులో నిజమెంతో ?