English   

సినిమాలతో బిజీ అందుకే ఎన్నికలకి దూరమన్న సూపర్ స్టార్ 

Upendra
2019-11-26 12:11:29

సినిమాలకి రాజకేయాలకి దగ్గర సంబంధమే ఉంది. సినీ స్టార్స్ ఎందఱో రాజకీయ నాయకులుగా రాణించారు. కానీ ఈ జెనరేషన్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా పార్టీ పెట్టి రాణించిన వారు లేరు. చిరంజీవి మొదలు పవన్, కమల్మ్ విజయ్ వంటి వారు పార్టీలు పెట్టి ఇబ్బంది పడ్డారు, పడుతున్నారు. ఇక కన్నడ విషయనికి వస్తే అక్కడ ఉపేంద్ర  ఒక పార్టీ పెట్టారు. అది వేరవరికో కట్ట బెట్టి మరో పార్టీ పెట్టారు. అయితే పార్టీ పెట్టి నా ఆయన సినిమాలు మానలేదు. దీంతో సినిమాలతో తీరిక లేకుండా ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కావడం లేదని ఉపేంద్ర అన్నారు. 

ఉపేంద్ర మీడియాతో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండేది..కానీ కొన్ని సినిమాలతో బిజీగా ఉండడం వల్ల పోటీ చేయలేకపోయానని, ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తుండటంతో ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే బీజేపే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా చేయడానికి క్యాంప్ కి వెళ్లి దాక్కున్న వారి మీద అనర్హత వేటు వేయడంతో ఈ ఎన్నిక  అనివార్యం అయింది. 15 స్థానాలకు జరుగనున్న ఉపఎన్నికలకు యూపీపీ నుంచి 15 మంది అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే దానిపై తప్పకుండా నిర్ణయం తీసుకుంటానని అన్నారు. నియోజకవర్గాల్లో తన అభిమానులను వాడుకోవడం లాంటివి ఉండవని మోడ్రన్ గవర్నెన్స్ కావాలనేది తమ లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు.

More Related Stories