English   

రియూనియన్ పార్టీలో ఆ నలుగురు మిస్సింగ్.. కారణాలివే..

Kamal Haasan Rajinikanth
2019-11-26 12:19:38

తెలుగు ఇండస్ట్రీ కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీ ఇప్పుడు రీయూనియన్ పార్టీ గురించి మాట్లాడుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో జరిగిన ఈ పార్టీలో దాదాపు 40 మంది స్టార్స్ పాల్గొన్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ ఇండస్ట్రీ లో నుంచి 80ల్లో నటించిన స్టార్స్ అంతా ఒక చోటికి చేరారు. బాలీవుడ్ నుంచి కూడా జాకీష్రాఫ్ వచ్చాడు. వీళ్లందరినీ చిరంజీవి స్వయంగా ఆహ్వానించారు. ఆయనే స్వయంగా తన కొలీగ్స్ కి వడ్డించడమే గాక.. డ్రింక్స్ సర్వ్ చేసాడని తెలుస్తోంది. ఆ తర్వాత అంతా పార్టీ చేసుకోవడమే కాకుండా డాన్సులు చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారని ప్రచారం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. 

చిరంజీవి తో పాటు వెంకీ-నాగార్జున లాంటి స్టార్స్ హాజరయ్యారు. కానీ నటసింహ బాలకృష్ణ ఎందుకనో ఈసారి పార్టీని మిస్సయ్యారు. మెగాస్టార్ పార్టీకి నుంచి రిలీజ్ చేసిన ఆ గ్రూప్ ఫోటోలో బాలయ్య ఎక్కడా కనిపించలేదు. గతంలో ఏర్పాటు చేసి పార్టీల్లో మిస్ అవ్వని బాలయ్య ఈసారి మాత్రం మిస్సయ్యారు. దానికి కారణం ఆయన రూలర్ సినిమాలతో బిజీగా ఉండటం కాకుండా అర్జెంటుగా దుబాయ్ కి ఒక పెళ్లి కోసం వెళ్లడమే. బాలయ్యతో పాటు మోహన్ బాబు, కమల్ హాసన్, రజినీకాంత్ కూడా చిరంజీవి అరేంజ్ చేసిన రీయూనియన్ పార్టీలో కనిపించలేదు. వీళ్లు లేని లోటు అక్కడ స్పష్టంగా కనిపించింది. వీళ్లందరితో పాటు హీరో రాజశేఖర్ కూడా రియూనియన్ పార్టీలో మిస్ అయ్యాడు. చిరంజీవితో ఎప్పుడూ గిల్లి కజ్జాలు పెట్టుకునే మోహన్ బాబు రాజశేఖర్ బాలకృష్ణ ఈ పార్టీకి మిస్ కావడంతో లేనిపోని అనుమానాలు అభిమానుల్లో వస్తున్నాయి.

More Related Stories