English   

షూట్ లేటైనా రిలీజ్ లేటవదంటున్నారు

kalyan
2019-11-26 18:40:58

ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దమయ్యాయి. వీటిలో సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే కాక ఇద్దరూ స్టార్స్ కావడంతో ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని ప్రచారం జరిగినా మహేష్ ఒక రోజు ముందు గానే వస్తున్నాడు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం మేరకు ఈ రెండు సినిమాల నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇకపోతే వీటితో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా ముందుగా అదే రోజు రిలీజ్ అవుతున్నట్టు ప్రచారం జరిగింది.

నందమూరి కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా రూపొందుతోన్న ఈ సినిమా గత నెల 31 నుంచి నవంబర్‌ 10 వరకూ షూట్‌ చేసి పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ షూట్ లేట్ అయ్యి షూటింగ్ కార్యక్రమాలను తాజాగా పూర్తి చేసుకుంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా పాటలు వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. డిసెంబరు 1 నుంచి రీరికార్డింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.  

 

More Related Stories