సెన్సార్ పూర్తి చేసుకున్న ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’

కమెడియన్‌గా ప్రేక్షకులను నవ్వించిన శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం హీరోగానూ మెప్పిస్తున్నారు. తాజాగా ఆయన స్వీయదర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన మూవీ ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. మంచి రసగుల్లా లాంటి సినిమా అనేది క్యాప్షన్. వెన్నెల కిషోర్, షకలక శంకర్, సత్య ఇతర కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ ఆవుతోంది. ‘జయమ్ము నిశ్చయమ్మురా ’ రచయిత పరం సూర్యాన్షు ఈ చిత్రానికి కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే సమకూర్చారు. అయితే రిలీజ్ కి దగ్గర పాడడంతో ఈ సినిమా సెన్సార్ కి వెళ్ళింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమా కి యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు. నో యాక్షన్ నో ఎమోషన్ ఓన్లీ కామెడీ అంటూ ఈ సినిమా పూర్తిగా హాస్య భరిత సినిమా అని తేల్చేస్తున్నారు మేకర్స్.