English   

తాత గెటప్ లో జూనియర్ ఎన్టీఆర్.. ఫోటో వైరల్..

jrntr
2019-11-27 05:13:10

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు అనేది ఒక పేరు కాదు.. ఎప్పటికీ నిలిచిపోయే చరిత్ర.. ఒక బ్రాండ్. తెలుగు సినిమా ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు పేరు కూడా ఉంటుంది. ఇక నందమూరి వంశంలో ఆయన పోలికలతో ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. అభినయం ఆహార్యంలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు నందమూరి చిన్నోడు. ఎలాంటి పాత్ర అయినా కూడా అచ్చంగా తాత మాదిరి అభినయించి మెప్పించడం జూనియర్ ఎన్టీఆర్ స్టైల్. నిన్ను చూడాలని అంటూ తొలి సినిమాలోనే  తాత  స్టైల్ అచ్చుగుద్దినట్టు ఫాలో అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. అప్పట్లోనే ఈ కుర్రాడ్ని చూసి ఆయన అచ్చంగా అన్నగారిలా ఉన్నాడు అంటూ అభిమానులు కూడా మురిసిపోయారు. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎప్పటికైనా ఆ నందమూరి తారక రాముడికి అసలు అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తాత వారసత్వం తీసుకుంటారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు. చాలా రోజులుగా తెలుగుదేశం ఎన్టీఆర్ చేతికి ఇస్తే తప్ప పార్టీకి భవిష్యత్తు ఉండదు అంటూ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇకపోతే ఇప్పుడు కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీనియర్ ఎన్టీఆర్ ఫోటోని తీసుకుని దానిని కాస్త ఎడిట్ చేసి ఆ ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్ పిక్ ని సెట్ చేయడం జరిగింది. కొన్నేళ్ల క్రితం అన్నగారు ఎన్నికల ప్రచార సమయంలో దిగిన ఆ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో జూనియర్ ని చూసిన వారందరూ అచ్చు గుద్దినట్లు తాతలానే ఎంతో అందంగా ఉన్నాడని దిష్టి పెడుతున్నారు. రూపంలోనే కాదు వారసత్వంలో కూడా ఆ తారక రాముడికి ఏమాత్రం తీసిపోకుండా ఈ తారక రాముడు కూడా రాజకీయాల్లోకి వచ్చి దుమ్ము దులిపేస్తాడు అంటూ అభిమానులు ఆశిస్తున్నారు.

 

More Related Stories