English   

పడుకుంటే తప్ప ఇక్కడ అవకాశాలు రావంటున్న ఎన్టీఆర్ హీరోయిన్..

actress
2019-11-27 05:41:02

సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనేది వేర్లతో సహా పాకిపోయింది. అంత త్వరగా దీన్ని తీసేయడం కుదరని పని. అవకాశం రావాలంటే కచ్చితంగా అమ్మాయి పడుకోవాల్సిందే అంటూ ఇక్కడ ఒక నీచమైన రూల్ ఉందని.. చాలా రోజులుగా ఎంతో మంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పేరు మంజరి ఫడ్నిస్. తెలుగు ఇండస్ట్రీలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం, శుభప్రదం లాంటి సినిమాల్లో నటించింది. దాంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన శక్తి సినిమాలో నటించింది ఈమె. అందం అభినయం ఉన్న కూడా తెలుగులో అవకాశాలు రాకపోవడానికి కారణం క్యాస్టింగ్ కౌచ్ ఓపెన్గానే నిజాలు చెప్పేసింది మంజరి.

నిజానికి తనకు చాలా పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చినా.. దర్శక నిర్మాతలు ఏమాత్రం సిగ్గులేకుండా తమతో పడుకుంటావా అని అడిగారని.. అందుకే ఆ అవకాశాలను వదిలేసినట్లు చెప్పింది మంజరి. తమతో సెక్స్ చేస్తే కానీ సినిమాలో అవకాశం రాదు అంటూ దర్శక నిర్మాతలు తెగేసి చెప్పడంతో చాలా సినిమాలకు అడ్వాన్సులు తీసుకుని మళ్ళీ వెనక్కి ఇచ్చేసాను అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా వరకు ఉందని.. అందుకే టాలెంట్ ఉన్న హీరోయిన్లు కూడా పెద్ద సినిమాల్లో అవకాశాలు రాక చిన్న సినిమాలతో సరిపెట్టుకుంటున్నారు అని చెబుతోంది ఈమె. మంజరి ఫడ్నిస్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ అయిపోయింది. మన దగ్గర ఈ స్థాయిలో దర్శకనిర్మాతలు అమ్మాయిల కెరీర్ తో ఆడుకుంటున్నారా అంటూ చర్చ మొదలైంది. ఈమధ్య మాధవి లత కూడా ఇలాంటి కామెంట్స్ చేసింది. కమిట్మెంట్ ఇస్తే తప్ప ఇక్కడ అవకాశాలు ఇవ్వలేని నీచమైన పరిస్థితికి తెలుగు ఇండస్ట్రీ దిగజారిపోయింది అంటూ మాధవీలత మండిపడింది. ఇప్పుడు మంజరి ఫడ్నిస్ కూడా ఇంచుమించుగా ఇదే చెప్పేసరికి సినిమా ఇండస్ట్రీ ఎటువైపు ఎవరికీ అర్థం కావడం లేదు.

More Related Stories