English   

పవన్ కళ్యాణ్ స్టైల్ ఫాలో అయిన మెగాస్టార్ చిరంజీవి..

arjun suravaram
2019-11-27 13:01:40

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు చేయడం లేదనే మాటే కానీ ఆయన ఇమేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. రాజకీయాల్లో ఉన్నా కూడా క్రేజ్ చెక్కుచెదరకుండా మెయింటెన్ చేస్తున్నాడు జనసేన అధ్యక్షుడు. ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తే చాలు అభిమానులు వేస్తూ  రచ్చ చేస్తున్నారు.  ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి అర్జున్ సురవరం ఈవెంట్ కు వచ్చాడు. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా ఏడాదిగా వాయిదా పడుతూ చివరికి ఎలాగోలా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 29న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్  హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ అతిథులుగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ వేడుకలో నిఖిల్ మాట్లాడుతూ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించాడు. 

మెగాస్టార్ చిరంజీవికి తాను అభిమానికి మాత్రమే కాదు భక్తుడిని కూడా అని తెలిపాడు. ఈ చిత్రానికి వరుసగా ఆటంకాలు ఎదురవుతున్న సమయంలో చిరంజీవి తమకు సపోర్ట్ చేస్తూ దేవుడిలా వచ్చారని నిఖిల్ తెలిపాడు. అర్జున్ సురవరం ప్రీమియర్ షోని ఆల్రెడీ చిరంజీవి చూసి తనని అభినందించారని.. ఆ క్షణాలని తన జీవితంలో మరచిపోలేనని నిఖిల్ అన్నాడు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత తనంతట తానుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చానని చెప్పాడు. నిర్మాతలు ఠాగూర్ మధు, రాజ్ కుమార్ లపై ప్రశంసలు కూడా కురిపించారు. ఠాగూర్ చిత్రంతో నిర్మాతగా మారిన ఠాగూర్ మధు ఈ రోజు టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉండడం తనకు సంతోషాన్నిచ్చే విషయం అని చిరు అన్నారు. అర్జున్ సురవరం చిత్రం చాలా బావుంది.. ప్రతి యువతకు కనెక్ట్ అయ్యే మూవీ ఇది.. నిఖిల్ నిజాయతీ కలిగిన జర్నలిస్ట్ గా అద్భుతంగా నటించాడు అని ప్రశంసించాడు మెగాస్టార్. 

ఈ చిత్రంలో విప్లవ వీరుడు చే గువేరాకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. చే గువేరా పేరు చెప్పగానే నాకు నా తమ్ముడు పవన్ గుర్తొస్తున్నాడు అంటూ పవర్ స్టార్ స్టైల్ లో మెడపై చేయి వేసాడు మెగాస్టార్. దాంతో అక్కడున్న పవన్ అభిమానులు ఒక్కసారిగా ఈలలు కేకలు వేస్తూ స్టేడియంను హోరెత్తించారు. కొన్ని నిమిషాల వరకు పవన్ నామస్మరణతో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా గోల గోల అయిపోయింది. మొత్తానికి అక్కడ పవన్ ఉన్నా లేకపోయినా కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అన్నట్లు అయిపోయింది సిచువేషన్.

More Related Stories