English   

కొత్త ఇల్లు అదిరిందయ్యా విజయ్ దేవరకొండ..

 Vijay Deverakonda
2019-11-27 14:08:05

తెలుగు ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో హీరో శకం నడుస్తుంటుంది. కొన్ని రోజులుగా తరుణ్.. ఉదయ్ కిరణ్.. ఇంకొన్ని రోజులు నితిన్ ఇలా ఒక్కోసారి ఒక్కో హీరో అంచనాలు లేకుండా వచ్చిన సంచలనాలు రేపుతుంటాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ టైమ్ నడుస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత ఈయన రేంజ్ మారిపోయింది. సెన్సేషనల్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. 

ఇక ఇప్పుడు ఈయన కొత్త ఇంటికి మారిపోయాడు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా శ్రీనగర్ కాలనీ నుంచి ఫిల్మ్ నగర్ కు షిఫ్ట్ అయ్యాడు విజయ్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఏడాదికి దాదాపు 15 నుంచి 20 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. 

ఇక ఇప్పుడు తన కొత్త ఇంటి కోసం కూడా దాదాపు 20 కోట్ల వరకు ఖర్చు చేసాడని తెలుస్తుంది. ఈ ఇల్లు అత్యంత విలాసవంతంగా ఉందని.. ఇందులో సకల సౌకర్యాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. బయటి నుంచి చూసిన ఫోటోలే అద్భుతంగా అనిపిస్తుండటంతో.. లోపల ఇంకెలా ఉంటుందో అని అంతా సంబరపడిపోతున్నారు. ఎంతో విశాలమైన ప్రదేశంలో ఈ ఇంటిని నిర్మించుకున్నాడు విజయ్. తన టేస్టుకు తగ్గట్టుగా ప్రత్యేకంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నాడు ఈ హీరో. 

మొత్తానికి ఇల్లు కొన్నావ్‌ సరే.. మరి పెళ్లి ఎప్పుడు విజయ్‌ దేవరకొండను నెటిజన్లు అడుగుతున్నారు. దీనిపై మాత్రం ఇప్పుడు అస్సలు ఫోకస్ లేదంటున్నాడు ఈయన. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో పాటు పూరీ జగన్నాథ్ ఫైటర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు విజయ్. ఈ రెండు 2020లో విడుదల కానున్నాయి. 

More Related Stories