English   

సంపూ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్

Sampoornesh Babu
2019-11-27 14:31:50

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు నడిపిస్తున్న మరో బస్సు ప్రమాదానికి గురయ్యింది. మితిమీరిన వేగంతో బస్సు రోడ్డుపక్కకు దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం కలగక పోవడం ఆనందించాల్సిన విషయం. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారును ఆర్టీసి బస్సు కొట్టింది. అయితే ఆయన కార్ను ఢీ కొన్న సమయంలో కుటుంబ సభ్యులతో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో భార్య, కూతురు కు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. దీని మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది. నిన్న కూడా హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఓ బైకును ఢీ కొట్టడంతో, టీసీఎస్‌ లో పని చేస్తోన్న యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికులు డ్రైవర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని చితక్కొట్టారు. ఆర్టీసీ తాత్కాలిక బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడని దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పేర్కొన్నారు.  

More Related Stories