English   

వరుణ్ సరసన ఇస్మార్ట్ భామలు

 Varun tej
2019-11-27 15:58:10

ఈ ఏడాది ఎఫ్2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో సూపర్‌డూపర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న వరుణ్ హీరోగా ఈ మద్యన కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సిద్ధు ముద్ద, అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు వెంకటేశ్ లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్రత్యేకమైన శిక్షణ తీసుకొని మరీ వరుణ్ మేకోవర్ అయ్యాడు. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఇద్దరు భామలను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇందులో కథానాయిక బాలీవుడ్‌ భామ కియారా అడ్వాణీ అంటూ గతంలో వార్తలొచ్చాయి. అయితే కియారా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టులో నటించే అవకాశాలు లేవని తాజా సమాచారం. అందుకే చిత్ర బృందం ఆమె స్థానంలో నిధి అగర్వాల్ ని సంప్రదించిందని సమాచారం. ఈ సినిమాలో మరో కీలక లేడీ పాత్ర ఉంటుందట. దాని కోసం నభా నటేష్‌ను ఎంపిక చేయనున్నారని వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరూ కలిసి రామ్ పూరీల ఇస్మార్ట్ శంకర్ లో నటించారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేసుకొని ఈ సినిమా డిసెంబరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.
 

More Related Stories