English   

పోలీస్ ఆఫీసర్ గా మారుతున్న నాగార్జున 

Nagarjuna
2019-11-27 16:13:47

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన ‘మహర్షి’ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. ఈ సినిమాకి కథ అందించింది హరి, సోలోమన్ అనే ఇద్దరు రచయితలు. ఆ సినిమాతో సక్సెస్ అందుకున్న సోలమన్ ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నట్లు సమాచారం. ఈ మధ్యనే సోలమన్ నాగార్జుకి ఒక కధ వినిపించాడట. ఈ కథ నాగార్జున కి కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. కథలో కొన్ని చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసి సోలోమన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడని అంటున్నారు. కొత్త దర్శకులతో సినిమాలు తీస్ వారిని ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే చాలా మంది కొత్త దర్శకులు ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాగార్జున ఇప్పుడు సోలమన్ ని కూడా దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన త్వరలోనే పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాని నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ సంస్థ నిర్మించనుందని సమాచారం. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సినీ వర్గాల సమాచారం. నాగార్జున గతంలో ‘ఆవిడా మా ఆవిడే’ ‘శివమణి’ ఆఫేసర్ వంటి సినిమాల్లో పోలీస్‌గా నటించారు. ప్రస్తుతం నాగార్జున బాలీవుడ్‌లో ఆయన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్రా’లో విష్ణు అనే పాత్రలో చేస్తున్నారు.

More Related Stories