కమ్మ రాజ్యంలో కడప రెడ్లు...రిలీజ్ ఆగుతుందా

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడడింది. ఈ సినిమాలో తన పాత్రను అసభ్యంగా చూపించారని క్రైస్తవ మత ప్రచారకుడు KA పాల్ ఈ పిటిషన్ వేశారు. ఎల్లుండి ఈ సినిమా విడుదల కాకుండా ఆదేశాలివ్వాలని పాల్ కోరారు. అయితే ఇవాళే రివ్యూ ఉందని రాంగోపాల్ వర్మ లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ సినిమాపై మరో పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలైంది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదలైతే గొడవలు జరుగుతాయని తాజా పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై మధ్యాహ్నం రెండున్నరకు విచారణ జరగగా వాదనలు విన్న కోర్ట్ చిత్రం పై సెన్సార్ రిపోర్ట్ సమర్పించాలని సెన్సార్ బోర్డుకు ఆదేశం జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇక ఈ క్రమంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆర్జీవీ కేఏ పాల్పైన మళ్లీ సెటైర్లు వేశారు. తన మూవీ కేరీర్లో తొలిసారి మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమా తీశానన్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. గత మే నెల నుంచి సెప్టెంబర్ వరకూ జరిగిన పొలిటికల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు తెలిపారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కేవలం ఫిక్షన్ అన్నారు ఆర్జీవీ. ఈ సినిమాకు ప్రముఖ తండ్రీకొడుకులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి తనకు గిల్లడమంటే ఇష్టమన్న వర్మ నాకు ఎవరి దగ్గర నుంచి బెదిరింపులు రాలేదని అన్నారు. తాను ఎవరినీ టార్గెట్ చేయలేదని అన్నారు. ఇక కమ్మ రాజ్యంలో కడపరెడ్లు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అన్న వర్మ ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువచేసి చూపించలేదని అన్నారు.