English   

ఆమెకి పెళ్లి గండం...కానీ సీఎం అయ్యే యోగం 

Nayantara
2019-11-27 17:02:49

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు అంతా సిద్దంగా ఉన్నా నయనతార పెళ్లి గురించిన వార్త ఒకటి వారం నుండి హల్చల్ చేస్తోంది. నిజానికి ఆమె నాలుగు బాషలలో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఆమెకి పెళ్లి గండం ఉందట. 2004లో ‘చంద్రముఖి’ సినిమాతో.. తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన.. ఆమె.. దాదాపు 15 సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా కనిపిస్తూనే ఉంది. మొదట శింబు, తర్వాత ప్రభుదేవ, ఇప్పుడు విఘ్నేష్.. ఇదీ నయనతార మీడియాకు ఉప్పందించిన కాబోయే మొగుళ్ళ లిస్ట్. పీటల దాకా వస్తోన్న ఆమె పెళ్లిళ్లు మాత్రం జరగడం లేదు. ఇప్పుడు కూడా విఘ్నేష్‌తో పెళ్లి జరుగుతుందా..? అంటూ అందరిలోనూ ఓ ప్రశ్న మొదలయ్యింది. మొదట శింబు విషయంలో పెళ్లి కన్ఫార్మ్ అయి ఇక మూడు ముళ్లు పడడమే ఆలస్యం అనుకున్న సమయంలో పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుదేవా విషయంలో కూడా అంతే ఇప్పుడు విజ్ఞేశ్ వంతు. నిజానికి నయన జాతకం ప్రకారం ఆమెకు పెళ్లి అస్సలు కాదని జోత్యిష్యులు అంటున్నారు. అంతేకాదండోయ్ ఆమె అలానే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి జయలలిత మాదిరిగా ముఖ్యమంత్రి కూడా అయిప్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు వాళ్లు చెబుతున్నారు. అందుకే విఘ్నేష్‌తో పెళ్లికి ఆమె వెనకడుగేస్తోందనేది తమిళ మీడియా టాక్. నయన్ పెళ్లి కూతురు అవుతుందో లేక ముఖ్యమంత్రిగా జాతిని శాసిస్తుందో చూడాలి. 

More Related Stories