ఫుడ్ పాయిజన్ కి గురై మరణించిన ప్రముఖ నటుడు

మలుముకలిలే దైవం అనే మలయాళ సినిమాతో సినీ పరిశ్రమకి పరిచయమయిన బాలా సింగ్ తమిళంలో ఫేమస్ నటుడు. ఆయన నటుడు నాజర్ నటించి, దర్శకత్వం వహించిన 'అవధారం' అనే సినిమా ద్వారా విలన్ గా తమిళ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందారు. ఆపై అడపా దడపా సినిమాలు చేసినప్పటికీ అతడిలోని నటుడిని గుర్తించింది, గుర్తించదగిన పాత్ర ఇచ్చింది మాత్రం దర్శకుడు సెల్వ రాఘవన్ అనే చెప్పాలి. పుదుపెట్టై అనే ధనుష్ హీరోగా వచ్చిన సినిమాతోనే బాలా సింగ్ దశ తిరిగింది. అందులో ఆయన నటించిన అన్బు పాత్ర అత్యద్భుతంగా ఉంటుంది. భారతీయుడు, పోతురాజు, ఇవన్, మద్రాస పట్టనం వంటి సినిమాలలో నటించిన ఆయన కెరియర్ మొత్తం 100 సినిమాలు వరకు చేశారు. చనిపోయేముందు అదే సెల్వ రాఘవన్ చివరగా దర్శకత్వం వచించిన ఎన్జీకే సినిమాలో ఒక మంచి పాత్ర పోషించారు. చివరిగా విడుదలైన సినిమా మగాముని. ఆయన ఎక్కువగా సపోర్టింగ్, విలన్ రోల్స్ పోషించారు. 67 ఏళ్లు నిండిన ఆయన చెన్నైలోని విజయ హాస్పిటల్ లో గత కొద్దిరోజులుగా ఫుడ్ పాయిజనింగ్ కి చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించారు.