English   

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. స్టైల్ ఐకాన్ ఆఫ్ టాలీవుడ్.. 

 Vijay Devarakonda
2019-11-27 18:19:46

త‌ప్పేం లేదు ఇప్పుడు ఈ బిరుదు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇవ్వ‌డంలో. ప‌క్క‌నే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నా కూడా క‌ళ్ల‌న్నీ త‌న‌పైనే ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న డ్రస్సింగ్.. క్యాస్ట్యూమ్ అన్నీ ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భ‌లే హైలైట్ అయ్యాయి. అస‌లు ఆ డ్ర‌స్ ఏంటో.. ఎలా ఉంటుందో.. ఎక్క‌డ్నుంచి మొదలైందో కూడా అర్థం కాన‌ట్లే ఉన్నా కూడా చూడ్డానికి మాత్రం భ‌లే ఉంది. ఒక‌టి రెండు మూడు అంటూ చాలా బ‌ట్ట‌లే వేసుకున్నాడు విజ‌య్. లోన బ‌య‌ట అన్నీ వేసుకుని పైన వేలాడే జాకెట్ ఒక‌టి వేసుకుని.. కింద ప్యాంటు కాకుండా నిక్కర్ వేసుకుని ఏదో కొత్త‌గా క‌నిపించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

ఇందులో విజయ్ తో పాటు రణ్ వీర్ సింగ్, దీపిక, విజయ్ సేతుపతి, పార్వతి తిరువోతు, ఆయుష్మాన్ ఖురానా, మనోజ్ బాజ్ పెయి, అలియా భట్ ఉన్నారు. అంతమంది ఉన్నా కూడా కెమెరా క‌ళ్లు మాత్రం విజ‌య్ వైపు వెళ్లిపోయాయి. అలా మాయ చేసాడు ఈ కుర్ర హీరో. రౌడీ క్ల‌బ్ అంటూ ఒక‌టి ఓపెన్ చేసి.. అందులో త‌న ట్రెండ్స్ వేసి కుర్రాళ్ల‌కు బాగా చేరువ అయిపోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలో తెలుగు నుంచి ఎవరూ వెళ్లలేకపోయారు కానీ విజయ్ దేవరకొండ మాత్రం అక్కడికి వెళ్లి సత్తా చూపించాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత‌గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాలతో విజయ్ రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతోపాటు ఫైటర్ తో బిజీగా ఉన్నాడు. కాస్త ఫ్లాపుల్లో ఉన్న ఈయన కెరీర్ ఒక్క హిట్ పడితే మళ్లీ సెట్ అయిపోతుంది.  

More Related Stories