English   

కొత్త అవతారంలో శ్రీముఖి

srimuki
2019-11-28 05:08:17

తెలుగు బుల్లి తెర మీద శ్రీముఖి మంచి ఫాలోయింగే ఉంది. ఆమె యాంకరింగ్ చేసిన ‘పటాస్’ ప్రోగ్రామ్‌ తోనే ఆమె యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా తన దైన హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ శ్రీముఖి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. స్మాల్ స్క్రీన్ మీదనే కాక ఆమె బిగ్ స్క్రీన్ మీద కూడా అడపాదడపా కనిపిస్తూ ఉంటుంది. అయినా ఇంకా ఏదో ఆశించి శ్రీముఖి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.అక్కడ ఈమెకు బిగ్‌బాస్ కిరీటం కొద్దిలో మిస్ అయినా ఈ రియాలిటీ షోతో మాత్రం బాగానే క్రేజ్ సంపాదించుకుంది. లౌడ్ స్పీకర్ అనే బిరుదు సంపాదించుకున్న శ్రీముఖి బిగ్‌బాస్ తర్వాత ఏ ప్రోగ్రామ్ చేస్తుందా అని ప్రేక్షకులతో పాటు అభిమానులు.. ఆసక్తిగా ఎదురు చూశారు.

అయితే శ్రీముఖి పటాస్ షో ద్వారానే ఫేమస్ అయింది కాబట్టి మళ్లీ పటాస్ షో లోకి ఎంట్రీ ఇస్తుందా అన్న విషయం మీద కూడా చర్చాప చర్చలు జరిగాయి. అయితే శ్రీముఖి మాత్రం ఇప్పటి వరకు పటాస్ కే కాదు మరే షోలో కూడా పాల్గొనలేదు. అయితే ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా యాజమాన్యంతో ఒక షో చేయడానికి అగ్రిమెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రోగ్రాం లో శ్రీముఖి పాట పాడుతూ చెప్పులు వేసింది. స్టార్ మా మ్యూజిక్ అనే కార్యక్రమంలో శ్రీముఖి ఆడి పాడి స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడాలి మరి ఈ షో ఏమేరకు హిట్ అవుతుందో ?

More Related Stories