English   

అల వైకుంఠపురంలో కథ అక్కడి నుంచి వచ్చిందా..

allu
2019-11-28 05:40:48

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురంలో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. జనవరి 12న విడుదల అవుతుందని దర్శక నిర్మాతలు కూడా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమాకు రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో కూడా పాత సినిమాలను తీసుకొని ఆ కథలను ఇప్పటి తరానికి నచ్చేలా మార్చి తెరకెక్కించాడు. మూడేళ్ల కింద సమంత జంటగా నటించిన అఆ సినిమా 40 ఏళ్ల కింద విజయనిర్మల తెరకెక్కించిన మీనా సినిమా రీమేక్. అలాగే ఇప్పుడు అల వైకుంఠ పురంలో కూడా ఒక పాత సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కథను 1958లో ఎన్టీఆర్, సావిత్రిల కాంబినేషన్లో వచ్చిన ఇంటిగుట్టు సినిమా కథను ఆధారంగా రాసుకున్నాడని తెలుస్తోంది. 

ఈ సినిమాలో కూడా ఇద్దరు స్నేహితులు ఉండడం.. వారికి ఒకేసారి అబ్బాయిల పుట్టడం.. వాళ్లను వారు తారుమారు చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది అసలు కథ. ప్రస్తుతం అలవైకుంఠపురములో సినిమాలో హీరో అల్లు అర్జున్, అక్కినేని సుశాంత్ లపై ఇదే కథను తెరకెక్కిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరి చిన్నపుడు తారుమారు అవడం.. కొంత కథ నడిచిన తర్వాత అసలు నిజం తెలియడం.. ఆపై అసలు తల్లితండ్రుల వద్దకు వారు ఎలా చేరారు అనేది మిగిలిన కథ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కథ బాగా వైరల్ అవుతుంది. మరి దీన్ని ఎలా ట్రీట్ చేసి ఉంటాడో చూడాలి.

More Related Stories