English   

ఈ టైంలో సైరా ఎవడు చూస్తాడు.. సీనియర్ నటుడు కామెంట్స్..

Giri Babu
2019-11-28 12:27:06

తెలుగు ఇండస్ట్రీకి బాహుబలి సినిమా తర్వాత అంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా సైరా. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించాడు. మిగిలిన భాషల సంగతి పక్కన పెడితే తెలుగులో మాత్రం సైరా నరసింహారెడ్డి 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే సైరా నరసింహారెడ్డి చిరంజీవికి నిరాశనే మిగిల్చింది. 

ఇప్పుడు ఈ సినిమా ఫలితంపై సీనియర్ నటుడు గిరిబాబు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. సైరా సినిమా చూసిన వెంటనే తన చిరంజీవికి ఫోన్ చేశానని.. అద్భుతమైన సినిమా చేశావ్ అని తెలిపారు గిరిబాబు. అయితే ఈ సమయంలో ఇలాంటి సినిమాలు చూడటం కష్టమే అని చెప్పినట్టు కూడా మీడియాకు తెలిపారు ఈ సీనియర్ నటుడు. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో ఇప్పుడు సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు ఇప్పుడంతా హీరోయిన్ల  పడటం.. కోతి వేషాలు వేస్తే సినిమాలు చూస్తారని స్వాతంత్ర్య పోరాట యోధుల కథ ఇప్పుడు చెబితే చూడటం కష్టం అంటూ చిరంజీవికి తాను చెప్పానని గిరిబాబు తెలిపాడు.

స్వతంత్రం వచ్చి ఇప్పటికే 75 ఇల్లు దాటిపోయిందని.. అప్పట్లో ఇలాంటి సినిమాలు తీస్తే జనాలు చూసేవారని చెప్పారు గిరిబాబు. అందుకే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, గాంధీ లాంటి సినిమాలు విజయం సాధించాయని కానీ ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తే చూడరు అని తెగేసి చెప్పాడు గిరిబాబు. ఆయన చెప్పడం కాదు కానీ నిజంగానే సైరా సినిమాలో తెలుగు ప్రేక్షకులు తప్ప మిగతా వాళ్లంతా మరో మాట లేకుండా తిప్పికొట్టారు. దీన్ని బట్టి ఈ సీనియర్ నటుడు చెప్పిన విషయం నిజమే విజువల్ వండర్స్ చూస్తారు కానీ స్వాతంత్ర సమరయోధుల కథలు చూడటానికి మాత్రం ఈ తరం అంతగా సిద్ధంగా లేరని సైరా నిరూపించింది.

More Related Stories