English   

రొమాంటిక్ బాలయ్య.. రూలర్ కొత్త పోస్టర్ విడుదల..

Balakrishnas Ruler
2019-11-28 16:02:26

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ తెరకెక్కిస్తున్న రూలర్ సినిమా మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో దర్శకనిర్మాతలు ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మధ్య విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రవికుమార్ ఈ టీజర్ కట్ చేశాడు. బాలయ్య కూడా మరోసారి ఫుల్ మాస్ అవతారంలో రెచ్చిపోయాడు. ఈ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు బాలకృష్ణ. 

గతంలో ఈయన పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించాయి. సీమ సింహం లాంటి ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే బాలయ్య ఖాకీ డ్రస్ వేసిన ప్రతిసారి బాక్సాఫీస్ బద్దలు అయిపోయింది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే చేయాలని చూస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఎప్పుడూ యాక్షన్ యాక్షన్ యాక్షన్ అనకుండా మధ్యలో రొమాంటిక్ బాలయ్యను కూడా పరిచయం చేస్తున్నాడు కె.ఎస్.రవికుమార్. ఈ సందర్భంగా ఇప్పుడు విడుదలైన కొత్త పోస్టర్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది.

 ఇప్పటికే ఈ సినిమాలో కొత్త బాలకృష్ణను చూస్తున్నారు అభిమానులు. హాలీవుడ్ హీరోల హెయిర్ స్టైల్ గడ్డం మీసం పెట్టుకొని బాలయ్య కేక పెట్టిస్తున్నారు. ఇప్పుడు మరోసారి పాత బాలకృష్ణను గుర్తుచేస్తూ పక్కా రొమాంటిక్ పోస్టర్ విడుదల అయింది. ఇందులో హీరోయిన్ వేదిక కూడా ఉంది. అప్పుడెప్పుడో కళ్యాణ్ రామ్ లాంటి హీరోలతో నటించిన తర్వాత తెలుగులో వేదిక అస్సలు కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు బాలకృష్ణ పుణ్యమా అని వస్తుంది. కచ్చితంగా ఈ సినిమాతో తెలుగులో పాగా వేస్తానని ధీమాగా చెబుతోంది వేదిక. మొత్తానికి రూలర్ సినిమాతో బాలయ్య ఏం చేస్తాడో చూడాలి.

More Related Stories