English   

మెగాస్టార్ షాకింగ్ నిర్ణయం...ఇక రిటైర్మెంట్

amitab
2019-11-28 19:58:52

బాలీవుడ్ మెగాస్టార్, బాలీవుడ్ కే పెద్ద దిక్కు లాంటి అమితాబ్ బచ్చన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఆయన అభిమానులలో టెన్షన్ రేపుతున్నాయి. ఆయన షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇక సినిమాలకు సెలవు ప్రకటించాలనుకుంటున్నారని అంటున్నారు. 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న అమితాబ్ ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇక సినిమాలకు సెలవు ప్రకటించాల్సిన సమయం వచ్చిందని తాజాగా తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. కోట్లాది మందికి ఆరాధ్య నటుడయిన ఈయన చాలాకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నప్పటికీ వయసైపోవడంతో ఒక్కోసారి అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల కూడా ఆయన అనారోగ్యం పాలై కొన్ని రోజులు హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే.

డాక్టర్స్ కాస్త షూటింగ్స్‌కి బ్రేక్ ఇవ్వాలని చెప్పారట. కానీ అమితాబ్ వినిపించుకోలేదు. హాస్పిటల్ నుంచి డిశ్చా్ర్జ్ అయిన రెండు రోజుల్లోనే సెట్స్‌కు వెళ్లిపోయారు. 'మనసు ఉత్సాహపడుతున్నా శరీరం సహకరించడం లేదు. బుర్ర  ఒకటి ఆలోచిస్తోంది, చేతి వేళ్లు మరొక సందేశాన్నిస్తున్నాయి. బహుశా నేను రిటైర్ కావాలని పరోక్షంగా అవి తెలియజేస్తున్నాయి అనుకుంటా' అంటూ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. నా శరీరం సిగ్నల్స్ ఇస్తున్నప్పటికీ  నేను ఇంట్లో కూర్చోలేకపోతున్నానని పేర్కొన్నారు. 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ లో భాగంగా అమితాబ్ మనాలీ వెళ్లారు. అక్కడి నుంచి కారులో సెట్స్ కు వెళ్తున్నప్పుడే ఈ రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని తన బ్లాగ్ లో పేర్కొన్నారు. 

More Related Stories