English   

మరో సినిమా లైన్ లో పెట్టిన విజయ్ దేవరకొండ

vijay
2019-11-28 20:16:08

టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. అంటే బ్యాడ్ టైం అనలేం కానీ చివరి సినిమా డియర్ కామ్రేడ్ గట్టిగా దేబ్బెసింది. మనోడి మార్కెట్ మీద భీబత్సమైన నమ్మకం పెట్టుకున్న మేకర్స్ ఏకంగా నాలుగు బాషలలో రిలీజ్ చేయగా కనీసం తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ చేయలేకపోయింది. అయినా మనోడి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుండి క్రేజీ స్టార్ గా బాలీవుడ్ లో ఎక్కువగా ప్రాజెక్ట్ అవుతున్నాడు. ఈయన ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో నటిస్తున్నాడు. 2020 ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రావచ్చని అంచనా. ఈ సినిమా లైన్ లో ఉండగానే ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫాంలోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ తో ఆయన ఒక సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభంకాక ముందే ‘నిన్నుకోరి’, ‘మజిలీ’ సినిమాల దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడని కూడా వార్తలు వచ్చాయి. అవి ఇంకా కన్ఫాం కూడా చేయలేదు. ఇప్పుడు మరో సినిమా లైన్ లో పెట్టాడని వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు ఈయన ప్రాజెక్టును ఫైనల్ చేశాడట. ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి విజయ్‌కు ఓ కథ చెప్పాడని, దానికి విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడని అంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా రాబోతోందట. ప్రస్తుతం మోహన్‌ కృష్ణ నాని, సుధీర్‌ బాబుతో ‘వి’ అనే వైవిధ్యమైన కథను తెరకెక్కిస్తున్నాడు. అయితే విజయ్ తర్వాతి మూడు సినిమాలు లైన్ లో పెట్టగా ముందు ఎవరితో సినిమా చేస్తాడు అనేది సస్పెన్స్ గా మాటింది.

More Related Stories