ఫ్లాప్ దర్శకుడికి లైన్ ఓకే చేసిన వరుణ్ తేజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన `నా పేరు సూర్య`తో దర్శకుడిగా తొలి అడుగు వేశాడు రచయిత వక్కంతం వంశీ. అప్పటి దాకా రైటర్ గా మంచి మంచి సక్సెస్ లను అందుకున్న వక్కంతం వంశీ డైరక్టర్ గా మొదటి సినిమానే ఫ్లాప్ అందుకున్నాడు. ఈ సినిమా బన్నీ కెరియర్ లోనే డిజాస్టర్స్ లిస్ట్ లో అతి పెద్దదిగా మారింది. ఇప్పుడు ఆ రచయిత మరో సినిమా లైన్ లో పెట్టాడట. అది కూడా మెగా కాంపౌండ్ హీరోతోనే !. ఆ హీరో మరెవరో కాదు వరుణ్ తేజ్ అని అంటున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తారని సమాచారం. అలాగే కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో చేయబోతున్న బాక్సింగ్ బేస్డ్ సినిమాతో పాటు ఈ సినిమాని కూడా సమాంతరంగా చేసే దిశగా అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం చేయనున్న బాక్సర్ చిత్రాన్ని కొడుకు నిర్మిస్తుంటే, ఆ తర్వాతి వరుణ్ సినిమాను తండ్రి నిర్మించనున్నాడన్న మాట.