హమ్మయ్య...సమంతా కన్ఫాం చేసేసింది

తెలుగులోనే కాక దక్షిణాది బాషలన్నిటిలో క్రేజీ హీరోయిన్స్ లో ఒకరిగా దూసుకుపోతోంది సమంత. అక్కినేని వారి కోడలు అయ్యాక కాస్త గ్లామరస్ పాత్రలు ఆపేసిన ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీలపై దృష్టి పెట్టి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. తాజాగా ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి తమిళ ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఆమె ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆమె కన్ఫాం చేయలేదు కానీ ఈ ప్రచారం మాత్రం ఎక్కడా ఆగలేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా సమంత ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ డికేలు ఇన్‌స్టాగ్రామ్‌లో స్వాగతం పలకగా దాన్ని రీపోస్ట్ చేసిన సమంత అమెజాన్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్‌లో నటించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సీజన్ ప్రసారం అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి సీజన్లో మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణిలు ప్రధాన పాత్రల్లో నటించారు. రెండో సీజన్లో సమంత మరో ప్రధాన పాత్ర పోషించనుంది. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ద్వయం హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు తెలుగులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'డి ఫర్ దోపిడి' సినిమాను కూడా తెరకెక్కించారు.