English   

భార్యతో కలిసి బీజేపీలో చేరిన కౌశల్

Bigg Boss 2 Kaushal
2019-11-29 11:44:46

నటుడు, బిగ్‌బాస్-2 విజేత కౌశల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. భార్య నీలిమతో కలిసి ఢిల్లీ వెళ్ళిన కౌశల్ అక్కడి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాంమాధవ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నడ్డా వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇక ఇదే కార్యక్రమంలో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుమార్తె, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ సుభారి కూడా బీజేపీలో చేరారు. నిజానికి గ‌త ఎన్నికల్లో కౌశ‌ల్ టీడీపీ వైపు మొగ్గు చూపిన‌ట్లు ప్రచారం జరిగింది. ఏకంగా విశాఖ జిల్లా నుంచి బ‌రిలో దిగనున్నట్లు ప్రచారం జ‌రిగింది. టీడీపీ త‌ర‌ఫున అన‌కాప‌ల్లి ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో టీడీపీ నుండి అన‌కాప‌ల్లి ఎంపీ అభ్యర్ది ఆయనే అని కూడా ప్రచారం జరిగిది. ఈ ప్రచారం ఎన్నికల తర్వాత ఆగినా ఇప్పుడు ఆయ‌న బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

More Related Stories