English   

ఆసక్తి రేపుతున్న అశ్వథ్థామ మోషన్ పోస్టర్

Naga Shaurya
2019-11-29 18:13:04

హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం `అశ్వథ్థామ`. రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని శౌర్య సొంత సంస్థ ఐరా క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ లోనే శౌర్య గాయపడ్డాడు. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి కాయా ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాని రిలీజ్ చేసే పనిలో పడడంతో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రిలీజైన మోషన్ పోస్టర్ తో ఈ సినిమాలో శౌర్య ఎంచుకున్న కథాంశం ఎంతో ఛాలెంజింగ్ గా ఉండబోతోందని చెబుతోంది. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫైట్ మాస్టార్ అన్బు ఆరివ్ ఫైట్స్ అందిస్తున్నారు. ఒక సముద్రం ఆ పక్కనే ఒక నగరం.. ఆ నగరంలో చురుకైన కుర్రాగా శౌర్యను చూపెట్టారు. వీటన్నిటినీ మించి నగరం మధ్యలో కపాలంగా మారిన గార్డెన్ ఏమిటో సస్పెన్స్ గా ఉంది. ఓవరాల్ గా పోస్ట‌ర్ క్రియేటివ్ గా ఆసక్తి రేకేట్టిబ్న్చేలా ఉంది. సినిమాలో నాగశౌర్యకు జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు.2020 ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఛలో తర్వాత హిట్ లేని నాగసౌర్య ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడమేమో చూద్దాం.

More Related Stories