English   

ఆంటీలతో అదిరిపోయే చిందులు వేసిన అన్నయ్య..

chiru
2019-11-30 07:03:25

వయస్సు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే.. అది శరీరంతో సంబంధం లేదని మరోసారి నిరూపించాడు మెగాస్టార్ చిరంజీవి. సైరా నరసింహారెడ్డి సినిమాలో ఈయన జోరు చూసినప్పుడే అసలు మెగాస్టార్ కు 64 ఏళ్లు ఉన్నాయా అని ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి. ఇప్పటికీ అదే జోరు అదే ఎనర్జీతో రఫ్ఫాడిస్తున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే ఈ మధ్య రీయూనియన్ పార్టీకి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి వేసిన డాన్స్ లు చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు ఖుష్బూ జయప్రద సుహాసిని లాంటి ఆంటీలతో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్టెప్పులు వేశాడు. బంగారు కోడిపెట్ట అంటూ మరోసారి పాత చిరంజీవిని గుర్తు చేశాడు మెగాస్టార్. అన్నయ్య స్టెప్పులు చూసి అక్కడున్న నాగార్జున అమల రాధిక లాంటివాళ్ళు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.

చేతిలో మందు గ్లాస్ పట్టుకొని నాగార్జున కూడా చిరంజీవిని తదేకంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. మరోవైపు మెగాస్టార్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా బంగారు కోడిపెట్ట పాట స్టెప్పులతో బిజీ అయిపోయాడు. చిరంజీవి ఎనర్జీ చూస్తుంటే నిజంగా ఈయనకు 64 ఏళ్లున్నాయా లేదంటే ఏదైనా అబద్ధం చెబుతున్నారా అంటూ అనుకోక తప్పదు. ప్రస్తుతం కొరటాల శివ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు మెగాస్టార్. ఈ సినిమాలో పూర్తిగా సందేశాత్మక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. భరత్ అనే నేను తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న కొరటాల శివ.. చిరంజీవి సినిమా మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు. డిసెంబర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సమ్మర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

More Related Stories