English   

వర్మపై పడిన శ్రీ రెడ్డి కన్ను.. పాపం ఆ జీవి పరిస్థితి ఏంటో..

rgv
2019-11-30 07:14:12

శ్రీ రెడ్డి.. ఈ పేరుకి తెలుగు ఇండస్ట్రీలో ఒక సపరేట్ ఫాలోయింగ్ వచ్చేసింది. కేవలం కాంట్రవర్సీలతోనే ఈమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త వివాదాలు సృష్టించి వార్తల్లో నిలవడం ఈమె ప్రత్యేకత. దానికితోడు ముందూ వెనకా చూసుకోకుండా ఇండస్ట్రీలో ఎవరిని పడితే వారిని నోటికొచ్చినట్లు తిట్టడంలో కూడా శ్రీ రెడ్డి స్పెషలిస్ట్. అయితే ఎప్పుడు తిట్లు శాపనార్ధాలతోనే కాకుండా తాజాగా ఆమెలో రొమాంటిక్ కోణం బయటకు వచ్చింది. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా.. శ్రీ రెడ్డి కూడా ఎంత అయినా అమ్మాయే కదా. అందుకే ఆమె కూడా ఒక్కోసారి రొమాంటిక్ గా ఆలోచిస్తోంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా వివాదాస్పద సుందరీ కన్ను సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ పై పడింది.

ఎందుకో తెలియదు కానీ ఆయనను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పింది. అంతేకాదు ఒప్పుకుంటే డేటింగ్ కు కూడా వస్తాను అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. నాకెందుకో నీతో డేటింగ్ చేయాలని ఉంది వర్మ అంటూ ఫేస్బుక్లో బంపర్ ఆఫర్ ఇచ్చింది శ్రీ రెడ్డి. ఇది చూసిన నెటిజన్లు భలే కాంబినేషన్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒకరు గిల్లకుండా ఉండలేరు.. మరొకడు ఎప్పుడు గిల్లుతూనే ఉంటారు. ఇలాంటి కాంబినేషన్ కలిస్తే వినడానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి శ్రీరెడ్డి ఇచ్చిన ఆఫర్ ను రాంగోపాల్ వర్మ తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. అసలే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఆగిపోయి ఫ్రస్టేషన్లో ఉంటాడు. ఇది తగ్గాలంటే శ్రీరెడ్డి ఇచ్చిన ఆఫర్ గురించి ఆలోచిస్తే మంచిదేమో అంటూ వర్మకు సలహాలు ఇస్తున్నాడు నెటిజన్లు.

More Related Stories